భద్రాచలం పక్కనే 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి !

-

తెలంగాణ, ఏపీ బార్డర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి భారీ వర్షాలకు పోలవరం ముంపు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. భద్రాచలం పక్కనే ఉన్న విలీన గ్రామాలు ఐదు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ ఆంధ్ర సరిహద్దులోని భద్రాచలం సమీపంలో ఐదు గ్రామాల ప్రజానీకం రాస్తోరోకోలు కొనసాగిస్తున్నాయి.

విలీన గ్రామాల్లో రాస్తోరోకో లు చేయాలని పిలుపునివ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాస్తారోకో లను నిషేధించింది. వరదలు నేపథ్యంలో ఆందోళన చేయటానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేయడంతో విలీన గ్రామాల ప్రజలు భద్రాచలం సమీపంలో రాస్తా రోకో లు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య పాల్గొని మద్దతు పలికారు. అయితే… దీనిపై రెండు తెలుగు ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news