కమలంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లకు మళ్ళీ తిరుగులేదా?

-

సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఏ విధంగా భారీ విజయం దక్కించుకుందో..బీజేపీలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ లకు తిరుగుండదని తెలుస్తోంది. ఇప్పటికే వారే బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు…బీజేపీ మరింత బలోపేతం అవ్వడంలో ఆ ముగ్గురు నేతలు కీలకపాత్ర పోషించారని చెప్పొచ్చు. అసలు ముగ్గురు ‘ఆర్‌ఆర్‌ఆర్’లు ఎవరో ఈపాటికే అర్ధమైపోయి ఉండాలి…2018 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన అన్నీ స్థానాల్లో ఓడిపోయినా సరే…కేవలం గోషామహల్ సీటులో రాజాసింగ్ గెలిచి బీజేపీ పరువు కాపాడారు.

ఇక తెలంగాణలో బీజేపీ సత్తా చాటడం మొదలైందని తెలిపేలా చేశారు….రఘునందన్ రావు. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యంగా టీఆర్ఎస్ ని ఓడించి రఘునందన్ ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ఒక అధికారంలో ఉన్న పార్టీని ఏ మాత్రం బలం లేదు అనుకునే బీజేపీ ఓడించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. అక్కడ నుంచే తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది.

అలాగే ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం…మళ్ళీ హుజూరాబాద్ బరిలో నిలబడి టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి..తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైందని నిరూపించారు. ఇలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లు బీజేపీ అంచలంచెలుగా ఎదగడానికి సాయపడ్డారు. ఇలా బీజేపీలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు…మళ్ళీ ఎన్నికల్లో సత్తా చాటగలరా? మళ్ళీ అద్భుతమైన విజయాలు సాధించగలరా? అంటే అందులో ఏ మాత్రం డౌట్ లేకుండా ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం ఖాయమని ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలు నిరూపించాయి. అటు మస్తాన్ సర్వే గాని, ఇటు ఆత్మసాక్షి సర్వే గాని…ఈ ముగ్గురు నేతలు మళ్ళీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాయి.

గోషామహల్ లో రాజాసింగ్, దుబ్బాకలో రఘునందన్, హుజూరాబాద్ లో రాజేందర్ గెలవడం ఈజీనే అంటున్నాయి. అయితే నెక్స్ట్ రాజేందర్…గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు…కానీ ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికైతే ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మళ్ళీ సత్తా చాటేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news