శ్రీవారి భక్తులకు శుభవార్త.. 16 ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..?

-

శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుపతి-హైదరాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ ప్రత్యేక రైలు (07509) ఆగస్టు 6, 13, 20న సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో (07510) ఆగస్టు 7, 14, 21న రాత్రి 11.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. అలాగే మరో ట్రెయిన్ (07433) హైదరాబాద్‌లో ఆగస్టు 2, 9, 16 , 23, 30న సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. అది మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతిలో (07434) ఆగస్టు 3, 10, 17, 24, 31న సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

irctc indian railways latest updates railway cancelled tains due to gurjar  strike rail roko trains cancel full list time table spl trains gurjar  andolan prt | IRCTC/Indian Railways Latest Updates: रेलवे ने

అలాగే నాందేడ్‌, తిరుపతి, ఔరంగాబాద్‌ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. నాందేడ్‌‌లో ప్రత్యేక రైలు (07633) ఈనెల 30న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది.. మరుసటి రోజు (జులై 31న) ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో (07634) ఈనెల 31న రాత్రి 9.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు నాందేడ్‌కు వెళుతుంది. మరో ప్రత్యేక రైలు తిరుపతిలో ఆగస్టు 7, 14, 21న ఉదయం 7గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఔరంగదాబాద్‌ చేరుకుంటుంది. ఔరంగదాబాద్‌లో (07638) ఆగస్టు 8,15, 22న రాత్రి 11.05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతికి వెళుతుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ సూచిస్తున్నారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news