వరదలు వస్తుంటే..నువ్వు ఢిల్లీ ఎందుకు పోయావని కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది లాగే ఈ ఏడాది వరదలతో ప్రజలు ఉక్కిబిక్కిరి అయ్యారు… గత ఏడాది లక్ష ఇళ్లలో నీళ్లు వస్తె ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మూసీ రివర్ మీద కార్పొరేషన్ ఎర్పాటు చేసి రుణాలు తీసుకున్నది కానీ ఒక్క అడుగు కూడ ముందుకీ వెళ్ళలేదు… ప్రాజెక్ట్ గ్రాఫిక్ ఏర్పాటు చేసి మభ్య పెట్టారు తప్పా మూసీ అభివృద్ది జరగలేదని ఆగ్రహించారు.
మూసీ ప్రాంతమంతా బడుగు బలహీనర్గాలు ఉండే ప్రాంతమని.. దీన్నీ అభివృద్ది చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని తేల్చి చెప్పారు. సిఎం గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రగతి భవన్ నుంచి బయటికీ వచ్చి ప్రజలను పరామర్శించలేదని మండిపడ్డారు. సిఎం గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రగతి భవన్ నుంచి బయటికీ వచ్చి ప్రజలను పరామర్శించలేదు… ఇప్పుడేమో సీఎం ఢిల్లీలో ఉన్నారని ఆగ్రహించారు. అసలు ఢిల్లీకి నాలుగు రోజులపాటు వెళ్లి సీఎం ఎం చేసారో ఎవరికి అర్థం కావట్లేదు… సీఎం ఏ మాత్రం చాలనం లేకుండా ఢిల్లీ వెళ్లడం విచార వ్యక్తం చేస్తున్నానని అన్నారు.