మళ్లీ హాట్​టాపిక్​గా పవిత్రా లోకేష్.. ఈ సారి​ ఏంటంటే?​

-

దక్షిణాదిలో సహాయక పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్రా లోకేష్​.. పలు వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సీనియర్ నటుడు నరేష్​తో సహజీవనం చేస్తున్నట్లు మీడియాలో హాట్​టాపిక్​గా మారారు. ఎందుకంటే..

పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ నటిగా పవిత్రా లోకేష్‌కు గొప్పగా పేరు రాలేదు. ఎప్పుడైతే సమ్మోహనం మూవీలో  నరేష్‌తో రిలేషన్‌షిప్ మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి ఆమె గురించి మీడియాలో కథలు కథలుగా కథనాలు వెలువడ్డాయి. అయితే నరేష్ గానీ, ఆమె గానీ తమ బంధాన్ని ఎన్నడూ బహిరంగంగా మీడియాకు వెల్లడించలేదు. వారి మధ్య సీక్రెట్‌గా సహజీవనం కొనసాగుతున్న సమయంలో వీకే నరేష్ భార్య చేసిన ఆరోపణలతో వారి రిలేషన్‌ను వీకే నరేష్ బయటపెట్టాడు.

పవిత్ర లోకేష్ నరేష్
పవిత్ర లోకేష్ నరేష్

మైసూర్‌ హోటల్‌లో వీకే నరేష్ మూడో భార్య బెంగళూరులో మీడియా సమావేశం పెట్టి తనకు విడాకులు ఇవ్వలేదనే విషయాన్ని స్పష్టం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే నాలుగో పెళ్లికి సిద్దమవుతున్నాడనే విషయాన్ని బట్టబయలు చేసింది. తన మూడో భార్య చేసిన ఆరోపణలను వీకే నరేష్ ఖండించారు. దాంతో పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్ వ్యవహారం మీడియాలో వివాదంగా మారింది. అయితే మైసూరులో వీకే నరేష్‌తో హోటల్‌లో పట్టుబడటం మరింత వివాదంగా మారింది.

పవిత్ర లోకేష్
అయితే నరేష్‌ సహజీవన వివాదం తర్వాత పవిత్రా లోకేష్ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజైంది. వీకే నరేష్, పవిత్రా లోకేష్ కాంబినేషన్‌లో కొన్ని సీన్లు ఉన్నాయి. అయితే వీరిద్దరూ తెర మీద కనిపించినప్పుడు థియేటర్లో కేకలు, అరుపులతో రచ్చగా మారింది. రవితేజ, హీరోయిన్లు స్క్రీన్ మీద కనిపిస్తే.. ఫ్యాన్స్‌లో అంత జోష్ కనిపించలేదు. అలాంటి క్రేజ్ పవిత్రా లోకేష్, వీకే నరేష్ జంటకు రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం పవిత్రా లోకేష్‌కు చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. బాలు శర్మ దర్శకత్వంలో నీతో చిత్రంలో రాజీవ్ కనకాలతో కలిసి నటిస్తున్నారు. అలాగే కన్నడలో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న సప్త సాగారదాచే ఎల్లో సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఉగ్రవతారలో సుమన్, అజయ్, ప్రియాంక ఉపేంద్రతో కలిసి నటిస్తున్నారు. అలాగే రాంపూర్ 0 కిలోమీటర్లు అనే సినిమాలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. ఇంకా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్‌తో కలిసి తెలిసినవాళ్లు అనే చిత్రంలో నటిస్తున్నది.

పవిత్ర లోకేష్ నరేష్
అయితే పవిత్రా లోకేష్ తాను నటించే సినిమాలు సక్సెస్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. గతంలో ఆమె రోజు వారీ కాల్షిట్ ప్రకారం రోజుకు 60 వేల రూపాయలు పారితోషికంగా అందుకొనేది. ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను రోజకు లక్ష రూపాయలకు పెంచినట్టు జాతీయ మీడియాలో కథనం వెలువడింది. దీంతో పవిత్రా లోకేష్‌ తన క్రేజ్‌ను, డిమాండ్‌ను క్యాష్ చేసుకొంటున్నారనే వాదన వినిపిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news