దిల్లీలో పొగడ్తలు… గల్లీలో విమర్శలా…? : కేంద్ర మంత్రి పై హరీశ్ ఫైర్

-

కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తరలించి…. బీడు భూములను సస్యశ్యామలం చేస్తుంటే భాజపా నాయకులు ఓర్వటంలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పార్లమెంటులో చెప్పిన షెకావత్‌….. రాష్ట్రానికి వచ్చి తప్పుడు విమర్శలు చేయటం సరికాదన్నారు. మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో ఎడున్నర కోట్లతో నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవనానికి మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.

వైద్య సదుపాయాల కల్పనలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. అధికారం కోసం భాజపా నేతలు బురద జల్లితే తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మే పరిస్థితి లేదన్నారు.

షెకావత్‌  విమర్శలు….  ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయని కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్… ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news