హుజూరాబాద్ గడ్డపై తనకు తిరుగులేని ఈటల రాజేందర్ ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు…అలాగే టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ..బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ…హుజూరాబాద్ గడ్డపై తిరుగులేదని ఈటల నిరూపించారు. అయినా సరే అక్కడ ఏదొరకంగా ఈటలని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ చూస్తూనే ఉంది..ముఖ్యంగా ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళి…టీఆర్ఎస్ గెలుపు కోసం తిరిగి చివరికి ఆ పార్టీ ఓడిపోయాక…ఎమ్మెల్సీ దక్కించుకుని రాజకీయం చేస్తున్న కౌశిక్…ఈటల టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు.
అసలు హుజూరాబాద్ అంటే ఈటల…ఈటల అంటే హుజూరాబాద్ అనే విధంగా పరిస్తితి ఉంటే…ఇంకా అక్కడ ఏదొక రచ్చ లేపడానికి కౌశిక్ చూస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని కౌశిక్…లేనిపోని సవాళ్ళు విసురుతున్నారు. హుజూరాబాద్ కు ఈటల ఏం చేశారో..అక్కడి ప్రజలకు బాగా తెలుసు. కానీ కౌశిక్ ఏదొక రాజకీయం చేయాలి కాబట్టి..హుజూరాబాద్ లో బాగానే హడావిడి చేస్తున్నారు.
పైగా టీఆర్ఎస్ టార్గెట్ గా ఈటల…ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు..ఈ నేపథ్యంలో ఈటలని ఎలాగోలా అడ్డుకోవాలని చెప్పి కౌశిక్ కొత్త రాజకీయాన్ని క్రియేట్ చేశారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరి..హుజూరాబాద్ చౌరస్తాలో తమ పార్టీ కార్యకర్తలని తీసుకొచ్చి పెద్ద రచ్చ లేపారు.
అటు కౌశిక్ కోసం ఈటల ఎందుకు…తాము చాలని హుజూరాబాద్ లోని ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు హుజూరాబాద్ సెంటర్ కు వచ్చారు. ఇక అక్కడ రెండు పార్టీల మధ్య పెద్ద రచ్చ జరిగింది…ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకోవడం, కర్రలతో దాడులు చేసుకోవడం చేశారు. ఇక పోలీసులు అలెర్ట్ అయ్యి…రెండు వర్గాలని చెదరగొట్టి పంపించేశారు.
అయితే ప్రశాంతంగా ఉండే హుజూరాబాద్ లో రచ్చ లేవడానికి కారణం కౌశిక్ రెడ్డి అని అక్కడ ప్రజలు తిట్టుకునే పరిస్తితి..ఎందుకంటే అసలు ఏమి లేకుండా ఆయనే…అభివృద్ధిపై సవాల్ చేసి..చర్చకు రావాలని సవాల్ చేసి…హుజూరాబాద్ సెంటర్ లో రచ్చ జరగడానికి కారణమయ్యారని ప్రజలు అనుకుంటున్నారు. మొత్తానికి కౌశిక్ ఎంత చేసిన హుజూరాబాద్ లో ఈటల బలం తగ్గించలేరని అంటున్నారు.
#Huzurabad @Eatala_Rajender @BJP4Telangana @trspartyonline @koushikTrs
Its TRS vs BJP at Huzurabad pic.twitter.com/3mz64KaUaR
— Sakshi TV Official (@sakshitvdigital) August 5, 2022