చదివింది ఎనిమిదో తరగతి.. సంపాదన లక్షల్లో..సక్సెస్ స్టోరీ..

-

డబ్బులు సంపాదించాలంటే చదువుతో పెద్దగా పనిలేదని ఇప్పటికే ఎందరో నిరూపించారు..ఇప్పుడు మరో వ్యక్తి తక్కువ చదివిన లక్షలు సంపాదిస్తూ అందరికి ఆదర్సంగా నిలిచాడు.అతని సక్సెస్ స్టోరి గురించి ఒకసారి తెలుసుకుందాం..ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది అనేది అందరికి తెలిసిందే..రాజస్థాన్‌కు చెందిన భవరామ్ జీవితం అందరికి ఆదర్శం..జాలోర్ జిల్లా పల్దీ గ్రామానికి చెందిన భవరామ్‌ కేవలం ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నాడు.

ఒకప్పుడు అతడు కూలి పనులకు వెళ్లి పొట్ట పోసుకునేవాడు. ఓ రోజు యూట్యూబ్ చూస్తుండగా కంటపడిన వీడియో అతడి జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత అతడు లక్షల్లో సంపాదించడం ప్రారంభించాడు.
ఒకప్పుడు కూలీ పనులకు వెళ్లిన తాను డబ్బులు సరిపోక ఇబ్బంది పడేవాడినని భవరామ్ చెప్పుకొచ్చాడు. ”చాలా సార్లు ఈ పని మానేయాలని నాకు అనిపించేది. కానీ..పని మానేస్తే పూట గడవడం ఎలాగో అని ఆందోళన చెందే వాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా.. బొప్పాయి పళ్లకు సంబంధించి వీడియోను చూశాడు..తైవాన్‌కు చెందిన రెడ్ లేడీ రకం బొప్పాయి పళ్ల సాగు గురించి ఆ వీడియోలో ఉంది. అధిక రాబడులను ఇచ్చే బొప్పాయి రకాల్లో ఇదీ ఒకటి. తక్కువ ఖర్చుతోనే మంచి లాభాలను పొందవచ్చు..ఆ ఐడియా బాగా నచ్చింది. దాంతో ఆ సాగు వైపు మొగ్గు చూపాడు.

గుజరాత్‌లో కూడా ఈ రకం పళ్లు ఉంటాయని తెలియడంతో అతడి సంతోషం రెట్టింపు అయ్యింది.. గతేడాది జూన్ నెలలో 2.5 ఎకరాల్లో అతడు రెడ్‌లేడీ బొప్పాయి పళ్ల సాగు మొదలెట్టాడు. ఒక్కో మొక్క రూ. 25 చొప్పున 2500 మొక్కలకు ఆర్డరిచ్చాడు. నీటి వినియోగం తగ్గించుకునేందుకు డ్రిప్ విధానాన్ని ఫాలో అయ్యాడు. సేంద్రీయ ఎరువులనే ఎక్కువగా వినియోగించాడు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరు నెలలకే పంట చేతికొచ్చింది. ఆ ఏడాది అతడు కళ్లు చెదిరేంతటి లాభాలు ఆర్జించాడు. ఇప్పటివరకూ తాను కోటి రూపాలయ విలువైన పళ్లను అమ్మినట్టు భవరామ్ మీడియాకు తెలిపారు. ఇక మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్న సమయాల్లో తానే స్వయంగా పళ్లు అమ్ముకునే వాడినని అతడు చెప్పుకొచ్చాడు. రెడ్‌లేడీ బొప్పాయి రుచి ప్రజలకు నచ్చడంతో రోజుకు 5 క్వింటాళ్ల వరకూ పళ్లు అమ్మేవాడినని తెలిపాడు. కేవలం 25 రూపాయలు ఖరీదు చేసే మొక్క తనను ఊహించని విధంగా సంపన్నుడిని చేసిందంటూ మురిసిపోయాడు..అతని సక్సెస్ ను చూసిన తోటి రైతులు అతనిని ఆదర్సంగా తీసుకున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news