‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి పవన్ కల్యాణ్.. పారితోషికం మరీ అంతనా?

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్..కు ఉన్న అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పేరు చెప్తే చాలు..అభిమానులు ఆనందపడిపోతుంటారు. వెండితెరపైన పవర్ స్టార్ కనబడితే సంబురాలు చేసుకుంటారు. ఆయన నటించిన ఫ్లాప్ ఫిల్మ్ కు కూడా మార్కెట్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రజెంట్ పవన్ కల్యాణ్ ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ రూ.కోట్లలో ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. కానీ, ఆయన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ ఇబ్బాయి’ చిత్రానికి తీసుకున్న పారితోషికం ఎంతో మీకు తెలుసా.. ఆ సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా చేసే క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అల్లు అరవింద్ ఇచ్చిన పారితోషికం మరీ తక్కువేనండోయ్. నెలకు రూ.5 వేలు మాత్రమే పవన్ కల్యాణ్ ఈ సినిమాకు పారితోషికంగా పవన్ కల్యాణ్ తీసుకున్నారట. అలా ఈ సినిమా పూర్తయ్యే నాటికి అల్లు అరవింద్ నుంచి మొత్తంగా రూ.50 వేలు పారితోషికంగా పవన్ తీసుకున్నారట.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పిక్చర్ కు యావరేజ్ టాకే వచ్చింది. ఈ సినిమా లో నటించినందుకు పవన్ కల్యాణ్ కు చక్కటి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news