కోటపల్లి అడవుల్లో పులి సంచారం.. భయాందోళనలో జనం

-

పులి సంచారం మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

Read more RELATED
Recommended to you

Latest news