మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ..కేవలం ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు. రామతీర్థం ఘటనలో ఖండించాం కానీ.. రెచ్చగొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మతప్రస్తావన తీసుకువచ్చేే వారిని.. తప్పులు చేసేవారిని జనసైనికులు, నేతలు ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు.
ఆర్న్నెల్లు కర్ర సాము నేర్చుకుని మూలకున్న ముసలమ్మను కొట్టినట్లు సీఎం జగన్ పరిస్తితి ఉందని ఫైర్ అయ్యారు. 151 సీట్ల మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజల మీద దాడి చేయడానికి ఆ అధికారం వాడుతున్నాడు…మోది దగ్గరకి సీఎం జగన్ వెళ్తే ఏం చేస్తాడు నాకు తెలుసన్నారు పవన్ కళ్యాణ్. బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్తున్న మీరు ఎక్కువ చేస్తే లెక్కలు తేల్చుకోవడానికి మేం సిద్ధం గా నే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు.