చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.
కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫిలిం క్రిటిక్ మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ ఎం గుండెపోటుతో మృతి చెందాడు. బాక్సాఫీస్ రిపోర్టులు, మూవీ రివ్యూలు, సినీ అప్డేట్స్ అలాగే సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం, వీడియో జాకీగా కౌశిక్ చాలా పాపులర్. అయితే తాజాగా అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కౌశిక్ మృతిపై రాఘవ లారెన్స్, ధనుష్, కీర్తి సురేష్ తదితరులు సంతాపం తెలిపారు.