తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రుక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేశారు వైసిపి పార్టీ కార్యకర్తలు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. కుప్పంలో అల్లర్లు అదుపు చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
సీఎం జగన్ ఓ దుర్మార్గుడు, ఫ్యాక్షనిస్ట్ అని.. రాష్ట్రంలో టిడిపిని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలను టిడిపి గెలవబోతుందని.. అందుకే జగన్ కి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు సరైన భద్రతను కల్పించడం లేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరే వారికి ఒక రేటు.. దాడి చేసే వారికి మరో రేటు ఇచ్చి ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు.