ఏపీ మహిళలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు.. నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీ మహిళలకు వైఎస్సార్ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసేందుకు సిద్ధం అయింది.
ఈ పథకానికి అర్హులైన అంటే 45 ఏళ్లు నిండిన వారి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదు తో పాటు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు నమోదు ప్రక్రియ ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో 45-60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు జగన్ సర్కార్ ఈ పథకం పేరుతో ఏటా రూ.18వేల 750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75వేలు అందజేస్తోంది. సెప్టెంబర్ 5 వ తేదీ వరకు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖస్తులపై సెప్టెంబర్ 8 లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి, అర్హులను గుర్తిస్తారు.