వీడియో: IND vs PAK.. నెట్ ప్రాక్టీస్‌లో విరాట్, రోహిత్ విజృంభణ

-

ఆసియాకప్-2022 రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న దాయాది దేశం పాకిస్తాన్‌తో భారత్ పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రోహిత్ శర్మ సేన కఠోరంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రాక్టీస్‌లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారీ షాట్లు కొడుతున్నారు. పాకిస్తాన్‌తో జరిగే తొలిపోరు నుంచి భారత్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ పేర్కొంది. కాగా, బింబాబ్వే పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లను బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇలాంటి పరిస్థితిలో రోహిత్, కోహ్లీ తీవ్రంగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news