గణేశ్ చతుర్థి వచ్చేస్తోంది. పిల్లాపెద్ద అంతా పండుగను వేడుకలా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దేశమంతా గణేశ్ మండపాలు చేయడంలో నిమగ్నమైంది. పిల్లలంతా ఈ నవరాత్రుల్లో ఎలాంటి ఆటలు ఆడుకోవాలి, ఏ భజన కీర్తనలు ఆలపించాలనేదానిపై చర్చల్లో బిజీగా ఉన్నారు. ఇక గృహిణులేమో.. ఈ గణేశ్ నవరాత్రుల్లో ఏ రోజు ఏ నైవేద్యం తయారు చేసి గణపయ్యకు సమర్పించాలనే దానిపై ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే వినాయకుడికి ఫేవరెట్ నైవేద్యం ఏంటంటే మోదకం. అదేనండి మోమోస్ లాగా ఉంటాయిగా అవే మోదకాలు. అయితే గణేశ్ నవరాత్రుల్లో చాలా మంది వారికి డయాబెటిక్స్ ఉండటం వల్ల నైవేద్యం తీసుకోవడానికి జంకుతుంటారు. వారి కోసం మీరు షుగర్ ఫ్రీ మోదక్ తయారు చేయొచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైఫ్రూట్స్ తో ఈ మోదక్ తయారు చేస్తే ఇంకా మంచిది. మరి టేస్టీటేస్టీ షుగర్ ఫ్రీ డ్రైఫ్రూట్స్ మోదక్ ఎలా తయారు చేయాలో చూద్దామా..?
షుగర్ ఫ్రీ మోదక్ తయారీకి కావలసిన పదార్ధాలు: ఖర్జూరాలు-1 కప్పు ఎండుద్రాక్ష-10 పిస్తాపప్పులు-10 తరిగిన జీడిపప్పు-8 బాదం-8 తరిగిన ఎండు కొబ్బరి పొడి-కప్పు గసగసాలు-2 స్పూన్ నెయ్యి-2 స్పూన్
మోదక్ తయారు చేసే విధానం: స్టెప్ – 1 బాణలిలో నెయ్యి వేసి వేడి చేయండి. అందులో గసగసాలు వేసి బాగా వేయించండి. దశ – 2 ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించండి. అనంతరం కొబ్బరి పొడి వేసి వేయించండి. దశ – 3 దీని తరువాత, ఖర్జూరాలను బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేయండి దశ – 4 ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ ను ఖర్జూర మిశ్రమాన్ని బాగా కలపాలి. మోదక మిశ్రమాన్ని రెడీ చేసి చల్లారనివ్వాలి. దశ – 5 ఇప్పుడు మోదక్ అచ్చును తీసుకోండి. అందులో నెయ్యి వేసి.. మిశ్రమాన్ని అచ్చులో పోసి మోదకాలను రెడీ చేసుకోండి. దశ – 6 ఈ విధంగా తయారు చేసిన మోదకాల పైన మోదక్‌ను గసగసాలతో అలంకరించండి. అంటే టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ మోదకాలు రెడీ.. గణపతికి నైవేద్యం పెట్టి అనుగ్రహం సొంతం చేసుకోండి.
డ్రై ఫ్రూట్స్‌ను భారతీయ వంటకాల్లో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వాటిలో చాలా పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. మీరు వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ను స్వీట్స్, ఖీర్ లో ఉపయోగిస్తారు. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష , ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి.