ఇండోనేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున సుమత్రా జిల్లాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 శాతంగా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. దాదాపు 11.9 కి.మీటర్ల భూఅంతర్భాగం లోతులో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు.
అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా, 2021 డిసెంబర్ 14వ తేదీన సుమ్రతా జిల్లాలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు వాతావరణ శాఖ సునామీ రానుందని హెచ్చరించింది. 2018లో 7.4 తీవ్రతతో భూకంపం రాగా.. అది 15 లక్షల మందిపై ప్రభావం చూపింది.