బలవంతంగా బీఫ్ తినిపించారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లోని సూరత్ ఉఢానాలో చోటుచేసుకుంది. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా వ్యక్తి ఆత్మహత్యకు భార్య, బావమరిదే కారణమని తేలింది.
అసలేం జరిగిందంటే.. రోహిత్ సింగ్ అనే వ్యక్తి సూరత్‌లోని టెక్స్టైల్ మిల్లులో రంగులు అద్దకం పని చేసేవాడు. అక్కడే అతడికి సోనమ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం కూడా చేసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లిని అంగీకరించకపోవడం వల్ల వీరు వేరే చోట కాపురం పెట్టారు.
ఈ క్రమంలో జూన్ 27న రోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య సోనమ్, బావమరిది అక్తర్ అలీ తనను హింసిస్తున్నారని, బలవంతంగా బీఫ్ తినిపించారని ఆరోపిస్తూ ఫేస్బుక్లో సూసైడ్ నోట్‌ను పోస్టు చేశాడు. ఈ సూసైడ్ నోట్‌ను రోహిత్ స్నేహితుడు చూడడం వల్ల దారుణం బయటపడింది.