రూ. 150 కోట్లతో కాణిపాకం ఆలయం అభివృద్ధి – మంత్రి పెద్దిరెడ్డి ప్రకటన

-

చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఏపీ ప్రభుత్వం తరపున స్వామి వారికి విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ….కాణిపాకం ఆలయం చాలా ప్రసిద్ది చెందిన దేవాలయమన్నారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించానని వెల్లడించారు. నాకు ఈ అవకాశం కలిపించినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

ఈ క్షేత్రము బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని.. రాబోయే రోజుల్లో 150 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరుగుతుందని వివరించారు. మరింత పెద్ద క్షేత్రం గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎస్. బాబు, ఆలయ ఈఓ సురేష్ ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news