హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఈ IRCTC ప్యాకేజీను చూడాల్సిందే..!

-

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకి గుడ్ న్యూస్. IRCTC ప్యాకేజీలను తీసుకొచ్చింది. వీటి ద్వారా భక్తులు తిరుమలను చూసొచ్చేయచ్చు. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. అయితే ఇది సెప్టెంబర్ 8, 9, 15, 16, 22 తేదీల్లో ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

 

ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్, కాణిపాకం కవర్ అవుతాయి. ఇక ఈ టూర్ ఎలా స్టార్ట్ అవుతోందో చూస్తే.. హైదరాబాద్‌ లో మధ్యాహ్నం 12.50 గంటలకు స్టార్ట్ అవ్వాలి. ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.55 గంటలకు తిరుపతి రీచ్ అవుతారు. నెక్స్ట్ కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ చూసి.. రాత్రికి తిరుపతిలోనే స్టే చేయాలి.

రెండవ రోజు అయితే తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలి. భోజనం తర్వాత శ్రీకాళహస్తి దర్శనం ఉంటుంది. నెక్స్ట్ తిరుపతి విమానాశ్రయంలో రాత్రి 8 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు టూర్ ముగుస్తుంది. ఇదే కాకుండా మరి కొన్ని టూర్ ప్యాకేజీలు కూడా వున్నాయి. ధరల వివరాలను చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,165, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.12,260, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,945 గా వుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news