జిమ్‌ చేశాక కొబ్బరినీళ్లు తాగే అలవాటుందా..?? అయితే..

-

అమ్మాయిలు ఒత్తైన జుట్టుకోసం.. ఎంత తాపత్రయ పడతారో.. అబ్బాయిలు కండలు తిరిగిన బాడీకోసం అంత తపన పడతారు. హైలెట్‌ ఏంటంటే.. ఇవి అనుకుంటే రావు.. వాటి కోసం తగిన చర్యలు తీసుకుంటేనే వస్తాయి. అవి కూడా నిరంతరం చేయాలి. నాలుగు రోజులు చేసి మానేస్తే కుదరదు. అయితే జిమ్‌కు వెళ్లే వాళ్లు వెళ్లామా, వచ్చామా అన్నట్లు కాదు.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే వాటిల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
జిమ్‌ చేసిన అనంతరం కూల్‌డ్రింక్స్‌ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. పానీయాలలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. జిమ్ తర్వాత కొబ్బరి నీరు తీసుకోవడం ద్వారా శరీర శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో కేలరీలను పెంచదు. జిమ్‌ చేసిన తర్వాత కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దాం.
కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా చక్కగా పెరుగుతుంది. అందుకే ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చట.
కొబ్బరి నీళ్లలో 5 రకాల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. మరోవైపు, కొబ్బరి నీరు విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలంగా చెప్తారు.. దీన్ని తీసుకోవడం వల్ల వర్కవుట్ అయ్యాక కండరాల్లో వచ్చే తిమ్మిర్లు దూరమవుతాయి. కాబట్టి జిమ్ తర్వాత అవి ఇవి తాగే బదులు రోజూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిదంటున్నారు నిపుణులు.
జిమ్ తర్వాత, స్పోర్ట్స్ తర్వాత డ్రింక్‌ని తీసుకోవాలనుకుంటే.. కొబ్బరి నీరు మంచి ఎంపిక. దీనివల్ల ఎలాంటి క్యాలరీలు పెరగవు, ఇంకా ఫిట్‌గా ఉంటారు. జిమ్‌ చేసే వాళ్లే కాదు.. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇది ట్రే చేయొచ్చు.
అధిక బరువు ఉన్నవారు తరచుగా అతిగా తినే సమస్యను ఎదుర్కొంటారు. వాళ్లకు ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. వర్కవుట్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకుంటే, చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news