HBD PK: చిరంజీవి నుంచి తమ్ముడికి ఎమోషనల్ బర్తడే విషెస్.. ట్వీట్ వైరల్..!

-

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ నేడు పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జనసేన పార్టీని ఏర్పాటు చేసి జనసేన అధినేతగా కొనసాగుతున్నారు. ఇక ఎలాగైనా సరే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని తన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం చేత పలువురు సినీ సెలబ్రిటీల నుంచి అలాగే రాజకీయ నాయకుల నుంచి పుట్టినరోజు వేడుకలు వెల్లువలా వస్తున్నాయి.. నిజానికి ఏ హీరో, హీరోయిన్ పుట్టినరోజు అయినా విషెస్ రావడం సహజమే కానీ పవన్ కళ్యాణ్ అంటే ఒక మేనిజం ఉంది. కాబట్టి ఈయనకు మరింత ఎక్కువగా విషేష్ రావడం గమనార్హం .ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా రీ రిలీజ్ చేసి రికార్డుల బ్రేక్ కొల్లగొడుతున్నారు.

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు ఏ రేంజ్ లో అయితే అభిమానుల సంఘాలు ఏర్పడ్డాయో.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా అదే రేంజ్ లో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక ఇవే ఆయన గుర్తింపును చాటి చెబుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్య దైవం పవన్ పై చేసిన ఒక ఎమోషనల్ విషెస్ ట్విట్టర్ రూపంలో చాలా వైరల్ గా మారింది. మరి మెగాస్టార్ తన తమ్ముడికి బర్త్డే విషెస్ ఎలా చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అంటూ పవన్ మెగాస్టార్ గ్రాండ్ విషెస్ ని తెలియజేశారు. ఇక ప్రస్తుతం చిరంజీవి పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అని అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news