పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలి – చిరంజీవి ట్వీట్

-

పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇవాళ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్‌ కళ్యాణ్‌ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. ఆయన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి కూడా.. ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కళ్యాణ్‌ కు శుభాకాంక్షలు చెప్పారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అని పేర్కొన్నారు.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు చిరంజీవి.  కళ్యాణ్ బాబు.. నిండు నూరేళ్లు జీవించాలని.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. అటు టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ కూడా ట్విట్టర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news