మునుగోడు లో బిజెపి గెలిస్తే.. టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది – రాజగోపాల్ రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చౌటుప్పల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలిస్తే నెలరోజుల లోపే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదని అన్నారు.

గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ నుండి బయటకురాని సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల దెబ్బతో అని నియోజకవర్గాలు తిరుగుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు ఉపఎన్నిక జరగబోతుందనిి అన్నారు రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ సమస్య గురించి మూడుసార్లు సీఎం అపాయింట్మెంట్ కోరినా.. ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 100 స్కీములు ప్రవేశపెట్టినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని నమ్మరని అన్నారు. మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్ కు బుద్ధి చెబుతారని అన్నారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news