సౌత్ కొరియాలో మాదిరిగా హైదరాబాద్‌ లో సైకిల్ ట్రాక్ – మంత్రి కేటీఆర్

-

నానక్ రాం గూడ ఓఆర్ఆర్ పక్కన సైకిల్ ట్రాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్.. శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితంగా ఉండే ట్రాన్స్పోర్ట్ ని ప్రోమోట్ చేయాలి అనుకుంటున్నాం.. సౌత్ కొరియాలో మాదిరిగా ఇక్కడ సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మణిహారం ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి జరుగుతుంది.. ఫిజికల్ ఫిట్నెస్ కోసం సైక్లింగ్ ని ఎంకరేజ్ చేస్తూ.. దీన్ని ఎల్లప్పుడూ ఓపెన్ గా ఉంచుతామని ప్రకటించారు.

ఇతర దేశాల్లో ఉన్న అన్నిటిని పరిశీలించి నిర్మాణం మొదలు పెట్టాం.. ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి అనుగుణంగా నిర్మాణం ఉంటుంది.. అతికొద్దీ రోజుల్లోనే పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ట్రాక్ పైకప్పులో సోలార్ ప్యానల్స్ ఉంటాయి.. వాటి ద్వారా 16వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. ట్రాక్ చుట్టూ షాప్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ రెంటల్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం.. పక్కనే అనంతగిరి హిల్స్ వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గండిపేట్ చుట్టూ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news