నెల్లూరులో ఫ్యాన్ స్పీడ్ తగ్గేదెలే..!

-

నెల్లూరు జిల్లా అంటే వైసీపీ కంచుకోట…ఇక్కడ వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది…2014 ఎన్నికలు కావొచ్చు…2019 ఎన్నికలు కావొచ్చు నెల్లూరు జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. 2014లో అధికారానికి దూరమైన సరే నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో అయితే జిల్లా క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే నెల్లూరులో వైసీపీ బలం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నర ఏళ్ళు అవుతుంది..అయితే పలు జిల్లాల్లో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ హవా కాస్త తగ్గుతుంది..అదే సమయంలో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఏదో రెండు, మూడు సీట్లలో తప్ప మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందట.

తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వేలో కూడా ఇదే తేలింది…నెల్లూరు జిల్లాలో ఆత్మసాక్షి సర్వే చేసిందట…ఇదే క్రమంలో జిల్లాలో 10 సీట్లలో పరిస్తితి ఎలా ఉందనే అంశంపై సర్వే చేసి…ఆత్మసాక్షి సంస్థ అధికారికంగానే సర్వే రిలీజ్ చేసింది. ఆ సర్వే ప్రకారం జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉండగా వైసీపీ 5 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంటుందని తేలింది.

వైసీపీ గెలుచుకునే సీట్లు నెల్లూరు రూరల్, ఆత్మకూరు, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, వెంకటగిరి సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని చెప్పింది. అలాగే నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి సీట్లని టీడీపీ గెలుచుకుంటుందని చెప్పింది. ఇక గూడూరు, కోవూరులో పోటాపోటీ ఉంటుందని సర్వేలో తేలింది. అయితే ఇక్కడ కావలి గాని, గూడూరు గాని వైసీపీ కంచుకోటలే. మరి ఎన్నికల ముందు ఉండే పరిస్తితులు బట్టి ఆ రెండు చోట్ల కూడా సీన్ మారవచ్చు. మొత్తం మీద నెల్లూరులో వైసీపీదే లీడ్.

Read more RELATED
Recommended to you

Latest news