రిస్క్ లేకుండా గ్యారంటీ, అద్భుతమైన రిటర్న్స్ ఈ స్కీమ్స్ తో .. పూర్తి వివరాలు ఇవే…!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్స్ గురించి చూడాలి. పైగా వీటిలో డబ్బులు పెడితే రిస్క్ ఏ ఉండదు.

మరి ఆ స్కీమ్స్ వివరాలను చూద్దాం. సెక్యూరిటీ గ్యారంటీని కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ తో పొందవచ్చు. నష్టం రాదు. ఇక రిస్క్ లేకుండా గ్యారంటీ, అద్భుతమైన రిటర్న్స్ ని స్కీమ్స్ తో ఎలా పొందొచ్చు, స్కీమ్స్ వివరాలను చూసేద్దాం.

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీం:

60 ఏళ్లు దాటితే ఇందులో డబ్బులు పెట్టవచ్చు. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వున్నాయి. 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ మూడు ఏళ్ళకి ఈ వడ్డీ రేట్లు మారతాయి. కనీసం 1000 రూపాయల్నించి 15 లక్షల వరకూ డబ్బులు పెట్టచ్చు.

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ NSC:

ఈ స్కీమ్ కి ఐదేళ్ల లాకిన్ పీరియడ్. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు వుంది. రిస్క్ ఉండదు. సురక్షితమైన రిటర్న్స్ ఈ స్కీమ్ తో. మెచ్యూరిటీ పూర్తయిన తరువాతే డబ్బులిస్తారు.

సుకన్య సమృద్ధి యోజన:

సుకన్య సమృద్ధి యోజన ద్వారా కూడా మంచి స్కీమ్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మూడు నెలల చిన్నారి నుంచి 10 ఏళ్ల వరకూ అమ్మాయిలకి ఈ స్కీమ్ ద్వారా డబ్బులు సేవ్ చెయ్యచ్చు. 250 రూపాయల్నించి లక్షా 50 వేల వరకూ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చాక ఆ డబ్బులు వస్తాయి.

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అకౌంట్:

ఇందులో డబ్బులు పెడితే కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 7.1 శాతం రిటర్న్ కాంపౌండ్ ఇన్వెస్ట్ రూపంలో లభిస్తుంది. ఈ స్కీమ్‌లో 15 ఏళ్లకు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. 500 రూపాయలు నుండి 1.5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. మూడేళ్లకు లోన్ కూడా పొందొచ్చు. ఐదేళ్ల తరవాత కావాలంటే డబ్బులు తీసుకోచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news