మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా…వీటిని తాగండి..!

-

మోకాళ్ల నొప్పి ఈ మధ్యకాలంలో అందిరిని వేధిస్తున్న కామన్‌ సమస్య.. ఇంతకు ముందు వయసు పై బడిన వారిలోనే మోకాళ్ల నొప్పి ఉండేది. ఇప్పుడు కాస్త నడి వయసు రాగేనే దీర్ఘకాలిక రోగాలతో పాటు ఇదీ వచ్చేస్తుంది. ఈ నొప్పులు రావ‌డానికి ప్రధాన కార‌ణం శ‌రీరంలో కాల్షియం త‌క్కువ‌గా ఉండ‌డమే అని చెప్పవ‌చ్చు. చాలా మంది రుచిక‌ర‌మైన ఆహారాన్ని తిన‌డానికి అల‌వాటు ప‌డి.. పోష‌కాహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. పోష‌కాహార లోపం వ‌ల్లే మ‌నం అనేక రోగాల బారిన ప‌డుతున్నామ‌ని నిపుణులు అంటున్నారు.

మోకాళ్ల నొప్పులకు కారణాలు..

మోకాళ్ల నొప్పులకు మోకాళ్లకు గాయం, మోకాళ్లపై నిరంతరం ఒత్తిడి, పగుళ్లు, కీళ్లనొప్పులు, కీళ్ల మధ్య జిడ్డు తగ్గడం, బరువు పెరగడం, శరీరంలో పోషకాలు లేకపోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. కీళ్లనొప్పులు లేదా గౌట్ కారణంగా చాలా మందికి మోకాళ్ల నొప్పులు ఉంటాయి. ఈ నొప్పి పురుషుల కంటే మహిళలను ఎక్కువగా బాధపెడుతుంది. మోకాళ్ల నొప్పులు ఉంటే ఏ పనీ చేయలేము. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పులనుంచి కొంత మేర ఉపశమనం పొందవచ్చు..

పసుపు పాలు తాగండి:

మోకాళ్ల నొప్పులకు పసుపు పాలు బాగా మేలు చేస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపులో యాంటీ సెప్టిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు కూడా గాయాలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపును పాలతో కలిపి ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తులసి సారం..

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసిని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి రసం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తులసి రసాన్ని కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఈ చిట్కాలతో అప్పుడప్పుడే మొదలయ్యే మోకాళ్ల నొప్పులకు చెక్‌ పెట్టేచ్చు.. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news