హుజూరాబాద్ లో ఎవరికి పడితే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పందించారు. ఈటల వ్యాఖ్యలను సీపీ ఖండించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. తుపాకీ ప్రదర్శించిన ఇల్లంతకుంట ఎంపీపీ భర్తను గట్టిగా హెచ్చరించామని వెల్లడించారు. విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కేవలం ఇద్దరికే లైసెన్సు కలిగిన తుపాకీలు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా తుపాకీ లైసెన్సులు ఇస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఈటల వ్యాఖ్యలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.