సమయం దొరికినప్పుడల్లా కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సారి కేటీఆర్ టార్గెట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి చేసిన ఓ పనిని మెచ్చుకున్నట్టే మెచ్చుకుని కేటీఆర్ ట్విటర్ లో సెటైర్ వేశారు. అసలేం జరిగిందంటే..?
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లో కిషన్‌రెడ్డి మంగళవారం మూడు ఎలివేటర్లను ప్రారంభించారు. ఈ విషయంపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. భాజపా ఎంపీ తన నియోజకవర్గానికి చేసిన గొప్ప పని ఎలివేటర్లను ప్రారంభించడమే అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చిన కిషనన్న వెల్‌డన్ అని ఎద్దేవా చేశారు.
“సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌లో మూడు ఎలివేటర్లను ప్రారంభించడం ఈ భాజపా ఎంపీ తన నియోజకవర్గానికి చేసిన గొప్ప పని. వెల్‌డన్ కిషనన్నా.. కేంద్రప్రభుత్వం నుంచి పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చారు.” – ట్విటర్‌లో మంత్రి కేటీఆర్
The 3 elevators inaugurated at Sitaphalmandi Railway station is possibly this BJP MP’s biggest achievement in his constituency
Well done Kishan Anna in bringing such large projects from Govt of India 👏 https://t.co/DtxQtIz65r
— KTR (@KTRTRS) September 14, 2022