సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటన.. పరారీలో మరో నిందితుడు

-

సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాజేందర్‌ సింగ్ అనే వ్యక్తి పేరుపై లాడ్జి భవనం ఉందని వెల్లడించారు. ఈ కేసులో తండ్రి రాజేందర్ సింగ్, కుమారుడు సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్, జస్పాల్ సింగ్‌లను అరెస్టు చేశామని.. రాజేందర్ సింగ్ మరో కుమారుడు సుప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడని చెప్పారు.

రాజేందర్‌ సింగ్‌ పేరుతో లాడ్జి భవనం ఉంది. ఆయనకు ఇద్దరు కుమారులు సునీత్, సుప్రీత్. లాడ్జి, ఈ-బైక్‌ వ్యాపారాలను చూసుకుంటున్నారు. వీరిలో సునీత్ సింగ్ ఎలక్ట్రిక్‌ బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తుండగా… తండ్రి రాజేందర్ సింగ్, మరో కుమారుడు సుప్రీత్ సింగ్ కలిసి లాడ్జిని నిర్వహిస్తున్నారు. జీహెచ్​ఎంసీ అధికారులు ఇప్పటికే లాడ్జిని సీజ్ చేశారు.

సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రూబీ ఎలక్ట్రిక్‌ బైక్ షో రూమ్‌ను మూసేసి రాజేందర్‌ సింగ్‌తో పాటు కుమారుడు సునీత్ సింగ్ కార్ఖానాలోని ఇంటికి వెళ్లారు. 9 గంటల 45నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం గురించి లాడ్జిలో పనిచేసే సిబ్బంది, యజమాని రాజేందర్‌సింగ్‌కు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చినప్పటికి మరణాల విషయం తెలుసుకోగానే అక్కడి నుంచి కిషన్‌బాగ్ పారిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ భవన యజమాని, రూబీ ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news