ప్రేమను పెంచే అసభ్య శృంగారపు సంభాషణ..

-

ఆలు,మగల మధ్య ప్రేమను పెంచే ఎన్నో మార్గాలు ఉన్నాయి..అన్నిటికన్నా ముందు ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి.దంపతుల మధ్య బంధాన్ని పెంచడానికి ఎన్నో పద్ధతులు ఉన్నా, కొన్ని పద్ధతులు మాత్రం ఆ బంధాన్ని మరింత బలపరుస్తాయి. అందులో ఒకటి శృంగారపు సంభాషణ..

చాలా మంది దంపతులు శృంగార సంభాషణలను కూడా బూతుగా పరిగణిస్తారు. అస్సలు మాట్లాడానికి కూడా ఇష్టపడరు. కానీ దంపతుల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలే గాని, వారిని మించిన మంచి దంపతులు ఉండరు. మౌనంగా రతిక్రీడలో పాల్గొంటే వ్యభిచారంతో సమానం అనే నానుడి కూడా ఉన్న సంగతి తెలిసిందే..

కొందరు శృంగార సంభాషణకు భయపడతారు, కానీ ఇది పూర్తిగా నిరాధారమైనది. మీ భాగస్వామితో శృంగార సంభాషణలు మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చేలా అగ్నిని పుట్టిస్తోంది.. చాలా మంది లైంగికంగా ఎంత రెచ్చగొట్టాలని చూసిన అయిష్టంగా, వారిని హాట్ చేయడం ఇష్టలేక ‘అవును, కాదు’ అనే సమాధానాలతో ఆపేస్తారు. కానీ శరీర ప్రేరణకు ఇద్దరి సహకారం అవసరమనే విషయాన్ని మర్చిపోతారు.
బోల్డ్ గా మాట్లాడినంత మాత్రాన మీ మీద గౌరవం లేదని కాదు. నిజానికి ఇద్దరు చేతులు కట్టుకొని కూర్చుంటే ఇద్దరికి చికాకే పుడుతుంది. అందుకే ఈసారి మీరే చొరవ చేసుకొని కాస్త బోల్డ్ మాటలతో రెచ్చగొట్టండి..ఆ పని కాస్త అయ్యాక కూడా మీ మీద ఇష్టం గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది..మీ గురించి మరింత చెప్పడానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి.

శృంగారభరితమైన సంభాషణ మాట్లాడితే, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు అనే మాట రానీయకండి. ఇది శృంగార మానసిక స్థితిని నాశనం చేస్తుంది. ఒక్కసారి మీ భాగస్వామి మీ పట్ల నిరాశ చెందితే అది మీ మధ్య దూరం మాత్రమే కాదు.. తిరిగి దగ్గర అయినా ఒకప్పటి సాన్నిహిత్యాన్ని ఇవ్వలేదు..నాలుగు గోడల మధ్య వీలైనంత పచ్చిగా ఉంటే బంధం మరింత దగ్గర అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news