ఆరోగ్య శ్రీ సేవలు, అవయవ మార్పిడి సర్జరీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

-

నిమ్స్, ఎం.ఎన్.జే ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు వైద్యాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ సేవలు, అవయవ మార్పిడి సర్జరీలు పెంచాలన్నారు. నిమ్స్, ఎం.ఎన్.జే కాన్సర్ ఆసుపత్రులకు ఎంతో మంచి పేరు ఉంది. ఎంతో నమ్మకంతో పేషెంట్లు వస్తున్నారు. వారికి నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిమ్స్, ఎం.ఎన్.జే ఆసుపత్రుల అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

నిమ్స్ లో వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అడగ్గానే సీఎం కేసీఆర్ రూ. 157 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. నిమ్స్ లో 200 పడకలతో ఎం సీ హెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎం ఎన్ జే ఆసుపత్రిలో ఇటీవల అధునాతన ఆపరేషన్ థియేటర్లు ప్రారంభించామని, త్వరలో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది అన్నారు.

దీంతో పడకల సంఖ్య 450 నుండి 750 పెరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనారోగ్యంతో వచ్చిన పేషెంట్ ని ఎమర్జెన్సీలో స్టేబిలైజ్ చేసిన వెంటనే వార్డుకు పంపాలన్నారు. దీని వల్ల మరింత మంది పేషెంట్లకు అత్యవసర సేవలు అందించడం సాధ్యమవుతుంది అన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ ప్రతి రోజూ ఎమర్జెన్సీ వార్డు సందర్శించి, బెడ్స్ నిర్వహణ సరిగ్గా జరిగేలా చూడాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news