అల్లు అర్జున్ స్థానంలో రామ్ పోతినేని నటించిన మూవీ ఏంటో తెలుసా?

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ చేస్తున్నాడు. ‘పుష్ప-1’ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో సీక్వెల్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, ఓ సినిమాలో డైరెక్టర్ సుకుమార్ తన దర్శకత్వంలో వచ్చిన ఓ పిక్చర్ లో హీరోగా అల్లు అర్జున్ ను అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత హీరోగా బన్నీ స్థానంలో రామ్ పోతినేని వచ్చాడు. ఆ సినిమా ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ పోతినేని హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జగడం’. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఓ మేరకు బాగానే ఆడింది. కాగా, ఈ సినిమాకు తొలుత హీరోగా అల్లు అర్జున్ ను అనకున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను ‘జగడం’ సినిమాను బన్నీతో తీయాలనుకున్నానని, కానీ, అప్పటికి ఉన్న కమిట్ మెంట్స్ , ప్రొడ్యూసర్ దిల్ రాజు తో డిస్కషన్స్ వలన రామ్ తో తీశానని చెప్పాడు సుకుమార్.

రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇషా నటించింది. ఈ సినిమా ఒకవేళ బన్నీ చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదని సినీ లవర్స్ అనుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయని సినీ ప్రేక్షకులకు అప్పటికే ఓ అభిప్రాయం వచ్చింది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో బన్నీ హీరోగా సుకుమార్ చేసిన తొలి సినిమా ‘ఆర్య’ సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ విదితమే.

సుకుమార్ ప్రస్తుతం బన్నీతో ‘పుష్ప-2’ చేస్తు్న్నాడు. ఇందులో హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప-1’ సూపర్ హిట్ అయింది. ఈ పిక్చర్ తో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news