టీఆర్‌ఎస్‌ నేతలను వెన్నులో వణుకు పుడుతోంది : వైఎస్‌ షర్మిల

-

మరోసారి టీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శల గుప్పించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల. మహబూబ్ నగర్ జిల్లాలో 24 గంటల పాలమూరు – నీళ్లపోరు దీక్ష విరమించిన వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వైఎస్సార్ ఎంతో చేశారు. పాలమూరు ఒకప్పుడు వలసల జిల్లా. నెట్టెంపాడు, భీమా,కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్ట్ లు కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పాలమూరు వెలుగు వెలిగేది. ఈ నియోజక వర్గంలో ఒకప్పుడు మంచి నీళ్లకోసం కోట్లాడే పరిస్థితి. రామన్ పాడు,కోయిల్ సాగర్ రిజర్వాయర్ ద్వారా మంచి నీళ్ళు ఇచ్చారు కాదా.. బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈ నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అంట.. మంత్రి అయ్యాక గట్టిగానే సంపాదించారట కదా.. బీసీలను పట్టించుకున్నరా..? మంత్రి నియోజక వర్గం లో పాలమూరు యూనివర్శిటీ ఎలా ఉందో అర్థం అవుతుంది. పోషమ్మా పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. వైఎస్సార్ ప్రజలకోసం స్థలాలు ఇస్తే ఇప్పుడు వాటిని కూడా అమ్ముకుంటున్నారు. ఈయన ఒక లిక్కర్ మంత్రి.. బంగారు తెలంగాణ అని చెప్పి లిక్కర్ తెలంగాణగా చేశారు.. లిక్కర్ లో తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది.. లిక్కర్ అమ్మకాలు పెరగడం లో ఆడవారి మీద లైగింక దాడులు జరుగుతున్నాయి..

Complaint against Sharmila for making inappropriate remarks about T'gana  CM, MLAs

ఆడవారి మీద రక్షణ కల్పించలేని ఈ మంత్రులు…సీఎం అందరూ ఉరి వేసుకోవాలి.. ఇవ్వాళ ఆడవారి మీద అత్యాచారాలు విషయంలో దక్షిణ భారత్లో నెంబర్ 1 గా ఉంది. టీఆర్‌ఎస్‌ నేతలను వెన్నులో వణుకు పుడుతోంది. వైఎస్ షర్మిల అను నేను ఎమ్మెల్యేలో ఇంకా అసెంబ్లీ లో అడుగే పెట్టలేదు.. అయినా నా పేరు అసెంబ్లీ కి చేరింది.. 8 ఏళ్లుగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లు ఇంత అవినీతి చేస్తుంటే బీజేపీ,కాంగ్రెస్ నేతలు ప్రశ్నించలేదు. అధికార పార్టీ కి అమ్ముడు పోవడం తోనే వేల కోట్లు సంపాదించారు. ఇంకో మంత్రి నిరంజన్ రెడ్డి మరదలు అంటే తప్పు లేదట. ఎవడ్రా మరదలు అంటే మాత్రం తప్పా. ఎవరైనా మరదలు అంటే ఊకుంటారా…చెప్పుతో కొడతారు..నేను అదే అన్నాను అని ఆమె వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news