బిజెపి వల్లభాయ్ పటేల్ ను కాంగ్రెస్ నుండి దూరం చేసే పనిలో ఉంది – మహేష్ గౌడ్

-

నిజాం నీ ఎదురించిన దాంట్లో కీలక పాత్ర కాంగ్రెస్ దేనన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. మాతో పాటు ఉద్యమం చేసింది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. సెప్టెంబర్ 17 లో బీజేపీ పాత్ర ఏంటి? అని ప్రశ్నించారు. నెహ్రూ, వల్లభాయి పటేల్ వల్లనే తెలంగాణ కి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. వల్లభాయ్ పటేల్ ను కాంగ్రెస్ నుండి దూరం చేసే పనిలో బీజేపీ ఉందని ఆరోపించారు.

రేపు ఉదయం 10 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని.. జెండా ఆవిష్కరణకు ముందు అందే శ్రీ రాసిన పాట రాష్ట్ర గీతంగా ఆలాపిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఇదే ప్రోటోకాల్ పాటించాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన చేస్తున్నామని.. తెలంగాణ ప్రజల మనోభాాలను ప్రతిబింబించే లా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఆవిష్కరిస్తామని.. తెలంగాణ లో మేము అధికారంలోకి రాగనే.. TS ని TG చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news