రేపు ఎన్టీఆర్ స్టేడియంలో లక్షమందితో కేసీఆర్ బహిరంగ సభ

-

తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల నేపథ్యంలోనే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..ఉండనున్నాయి. అంతేకాదు… ఎన్టీఆర్ స్టేడియం లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఈ సభకు 33 జిల్లాల నుండి 2300 బస్సులలో 1 లక్ష మంది హాజరవుతారని.. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనలు..పలు కార్యక్రమాలు.. ఉంటాయని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 2300 బస్సులో 1 లక్షకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో సెంట్రల్ జోన్ తో పాటు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు చేస్తామన్నారు. ఇందిరా పార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర..పూర్తిగా స్థాయి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లోని 9 జంక్షన్ లను ప్రయాణికులు రూట్ మార్చుకోవాలి.. కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు..లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్ లలో ట్రాఫిక్ పూర్తిగా మల్లింపు ఉంటుందని వెల్లడించారు జాయింట్ సిపి రంగనాథ్.

సెంట్రల్ జోన్ లో ప్రధానంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం జరగవచ్చు.. వాహన దారులు గ్రహించి ఈ ఏరియా ను డైవర్ట్ చేసుకోవాలి.. 33 జిల్లాల నుండి ప్రజలు ఇక్కడికి పలు ఏరియా ల నుండి వస్తున్నారన్నారు. నెక్లెస్ రోడ్ , పబ్లిక్ గార్డెన్స్..నిజాం కాలేజ్ లో..జిల్లాల నుండి వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం ఉంటుందని.. జి హెచ్ ఎం సి..ఆర్టీసీ, పోలీస్, అధికారుల సమన్వయం తో ప్రశాంతంగా జరుగేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నామని చెప్పారు జాయింట్ సిపి రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news