దేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో పర్యటించిన శంకర్ సింగ్.. ప్రగతి భవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. దాదాపు 5గంటలపాటు జాతీయ అంశాలపై చర్చించారు.
బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని వాఘేలా వ్యాఖ్యానించారు. కేసీఆర్కు తన లాంటి అనేక మంది సీనియర్ల మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నియంతృత్వ ధోరణిని నిలువరించేందుకు సరైన వేదిక లేక.. తనలాంటి సీనియర్లు ఆందోళనతో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర విధానాలను కేసీఆర్ ప్రతిఘటిస్తున్న తీరు తమను ప్రభావితం చేసిందని వాఘేలా చెప్పారు.
ముఖ్యమంత్రిగా తెలంగాణను ముందుకు నడిపిస్తూనే.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కృషి చేస్తానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. వాఘేలా వంటి సీనియర్ల మద్దతు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తన నాయకత్వాన్ని సమర్థించిన వారందరికీ.. ధన్యవాదాలు తెలిపారు.