ప్రార్ధించే పెదవులు కన్నా దానం చేసే చేతులు మిన్న అంటారు. పది రూపాయలు దానం చేస్తే పోయేదేముంది. ఆ పది రూపాయలతో మిద్దెలు కట్టలేం. దానం పొందిన వారు కోటీశ్వరుడు అయిపోయాడు. నిజానికి ఆ పది రూపాయలతో ఏదీ రాదు. కానీ దానం చేసామన్న తృప్తి మాత్రం మిగులుతుంది. దానం అందుకున్న వారి ఆశీస్సులు దక్కుతాయని పెద్దలు అంటారు. అందరికీ దానం చేయలేకపోయినా కొందరికైనా దానం చేస్తే మంచే జరుగుతుంది గానీ, చేడేం జరగదు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అయితే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ముంబైలోని బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో పనిముగించుకున్న అనంతరం హీరోయిన్ రకుల్ ప్రతీసింగ్ బయటకు వచ్చింది. కారు దగ్గరకు వెళ్లబోతుంటే ఒక్కసారిగా ఆమెను బెగ్గర్స్ వెంబడించారు. అమ్మ దానం చేయండి. కనీసం రూపాయి అయినా ఇవ్వండంటూ యాచించారు. కానీ రకుల్ లేదు లేదు అంటూ తల అడ్డుగా ఊపుకుంటూ వెళ్లిపోయింది. బెగ్గర్స్ తమ స్టైల్లో రెచ్చిపోయినప్పటికీ రకుల్ నుంచి రూపాయి కూడా పిండలేకపోయారు. అది గమనించిన రెస్టార్ రెంట్ సిబ్బంది రకుల్ రక్షణగా నిలబడ్డారు. దగ్గరుండి ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయే వరకూ రక్షణ కల్పించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో జోరుగా వైలర్ అవుతోంది.
ఈ సన్నివేశం చూసిన నేటి జనులు ఊరుకుంటారా? తమ స్టైల్లో చెలరేగిపోయారు. ఏడాదికి కోట్లలలో సంపాదిస్తోంది….అటు వ్యాపార రంగంలోనూ బాగానే సంపాదిస్తోంది. అలాంటి నటి బెగ్గర్స్ కనీసం రూపాయి కూడా దానం చేయకపోవడం దారుణమంటూ కామెంట్లు పెడుతున్నారు. కూలి పని చేసుకునేవారికే బిక్షగాళ్లు తారసడితే రూపాయి, రెండు చిల్లర వేస్తారు. అలాంటింది రకుల్ అంత సంపాదిస్తోన్న బ్యాంగ్ లోంచి రూపాయి తీయలేదంటే? ఎంత పిసినారి అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.