వీ6 చానెల్‌కు తీన్‌మార్ సావిత్రి గుడ్‌బై.. బిగ్‌బాస్ కోసమేనా?

-

తీన్మార్‌ సావిత్రి పరిచయం అక్కరలేని పేరు.. మన ఇంటి పిల్ల అన్నంతలా ప్రేక్షకులకు దగ్గరైంది.    తెలంగాణలోని ప్రతి పల్లెకు ఆమె సుపరిచితురాలు. ప్రతి రోజు రాత్రి 9.30 అయిందంటే చాలు.. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఆమె గొంతు వినిపించాల్సిందే. ఆమె యాస, భాషకు తెలంగాణ ప్రజలు కూడా ఫిదా అయ్యారు. తెలంగాణ యాసను ఔపోసన పట్టింది. అందుకే.. వీ6 న్యూస్ చానెల్‌లో తీన్‌మార్ న్యూస్ యాంకర్ చాన్స్ కొట్టేసింది. పల్లె పల్లెకు సెలబ్రిటీ అయిపోయింది. ఆమే తీన్‌మార్ సావిత్రి. అసలు పేరు శివజ్యోతి.

వీ6 టీవీ తీన్మార్‌లో సావిత్రి ఇక కనిపించదు. వచ్చిన చిన్న అవకాశాన్ని తన టాలెంట్‌తో సావిత్రి పేరుకే బ్రాండ్‌ నేమ్‌ తెచ్చిన శివ జ్యోతి అనివార్య కారణాలతో తన జాబ్‌కి రిజైన్‌ చేసినట్లు తెలుస్తుంది. నిజామాబాద్‌కు చెందిన శివ జ్యోతి అలియాస్‌ సావిత్రి సాధారణ కుటుంబానికి చెందినది. మారు మూల ప్రాంతం నుండి వచ్చిన సావిత్రి నేడు తెలుగు ప్రజలకు ఎంతో చేరువైంది. అయితే సావిత్రి తన ఉద్యోగాన్ని వదిలేందుకు గల కారణం ఏమై ఉంటుంది.. ?

అయితే.. సావిత్రి తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పడం వెనుక కారణం బిగ్‌ బాస్‌ నుండి ఆఫర్‌ రావడమే అంటూ గుసగుసలాడుతున్నాయి మీడియా సర్కిల్‌లో. ఎంతో మంది యాంకర్‌లు ఉండగా సావిత్రికి ఆ ఆఫర్‌ రావడమేంటంటూ కొట్టిపారేస్తున్నారు మరికొందరు. దొరికిందే ఛాన్స్‌ అనుకుంటూ మరి కొందరు అట అంటూ కథలు అల్లేస్తున్నారు. ఆ అట ఏందో చూడండి.. ఆమె బిగ్‌బాస్‌కు సెలక్ట్ అయిందట. బిగ్‌బాస్ సీజన్ 3 కోసం ఆమెను నిర్వాహకులు కలిశారట. బిగ్‌బాస్‌లాంటి రియాలిటీ షోలో అవకాశం రావడం అనేది చాలా అరుదు. అటువంటి షో నుంచి పిలుపు రావడంతో.. అది జీవితాన్ని మలుపు తిప్పే రియాల్టీ షో కావడంతో ఆమె బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లేందుకు ఒప్పుకున్నదట.
ఇదండీ కథ.. నిజంగానే సావిత్రికి బిగ్‌ బాస్ అవకాశం వచ్చిందా..? అఫీషియల్‌గా తెలియాలంటే బిగ్‌ బాస్‌ స్టార్ట్‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news