మామూలుగా మనం నిద్ర పోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి భయంకరమైన పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు పీడకలలు వస్తాయి అని అనుమానం చాలా మందిలో ఉంటుంది. పైగా పీడకలలు వచ్చాయి అంటే భయపడిపోతు ఉంటారు. అయితే అసలు ఎందుకు పీడకలలు వస్తాయి..? దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక నిపుణులు పీడ కలలు రావడం వెనక ఉన్న కారణం తెలిపారు. ఎవరో వెనకాల తరుముతున్నట్లు, పాము మన వెనక పరిగెడుతున్నట్లు, నదిలో కాని సముద్రములో కాని పడిపోయినట్లు, భయంకరమైన ప్రదేశంలో తప్పిపోయినట్లు ఇలాంటివి కనబడుతుంటాయి.
దీని కారణంగా నిద్రలో నుండి హఠాత్తుగా బయటకి వచ్చేస్తారు. మానసిక ఆరోగ్యం కూడా వీటివల్ల దెబ్బతింటుంది. అయితే ఈ పీడ కలలు ఎందుకు వస్తాయి అనే దాని వెనుక కారణం చెప్పడం చాలా కష్టమని మానసిక నిపుణులు అంటున్నారు. కానీ వ్యక్తి మానసిక స్థితి ఆధారంగా ఇలాంటి కలలు వస్తాయి.
ఈ కలలు కూడా వ్యక్తీకరణలో భాగమే అని మానసిక నిపుణులు చెప్పడం జరిగింది. పైగా బాల్యంలో ఏవైనా ఇబ్బందులు ఎక్కువగా వుంటే అవి యుక్తవయసులో ప్రభావం చూపిస్తాయని వీటివల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. 80 శాతం మంది యుక్త వయసు వచ్చినప్పుడు ఇటువంటి కలల్ని కంటారు. ఇవి రాకుండా అడ్డుకోవడం మాత్రం ఎంతో కష్టమని మానసిక నిపుణులు చెబుతున్నారు.