ఫ్యాక్ట్ చెక్: లోక్ సభ ఎలెక్షన్లలో ఓట్లు వెయ్యకపోతే బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యిపోతాయా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. లోక్ సభ ఎలక్షన్స్ 2024 అనేది పెద్ద ఎలక్షన్. ఇప్పటికే రాజకీయ నాయకులు ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంలో లోక్ సభ ఎలక్షన్లకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.

ఈ ఎలక్షన్లకు ఓట్లు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుండి 350 రూపాయలు కట్ చేస్తారంటూ వార్త వచ్చింది. నిజంగా ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయిపోతాయా..? ఇందులో నిజమెంత అనేది చూస్తే… సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.

డబ్బులు బ్యాంక్ ఖాతా నుండి కట్ అవ్వవు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఇటువంటి మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే పైగా ఎలక్షన్ కమిషన్ బ్యాంకుల కి దీని గురించి చెప్పింది. బ్యాంకులోని ప్రజలకు తెలిసేలా ఎనౌన్స్ చేయమని చెప్పింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది నకిలీ వార్త అని తేల్చేసింది ఇందులో ఏ మాత్రం నిజం లేదు కనుక ఇటువంటివి నమ్మకండి. అలానే ఇతరులకు షేర్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news