ప్రేమ, పెళ్లి అంటూ సినీ పరిశ్రమలో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచారు విఘ్నేశ్ నయనతార దంపతులు. అయితే ఆదివారం విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య నయనతార స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే?
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను స్టార్ హీరోయిన్ నయనతార.. ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు. పెళ్లికి ముందు విఘ్నేశ్.. బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన నయన.. వివాహం తర్వాత కూడా బర్త్‌డేను స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు.
విఘ్నేష్ శివన్ ఈ ఏడాది దుబాయ్‌లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య నయన్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.
”నన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యుల నడుమ… స్వచ్ఛమైన ప్రేమతో నిండిన రోజు ఈ పుట్టిన రోజు. నా వైఫ్ (నయనతార) అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. నా మనసుకు దగ్గరైన వ్యక్తులతో బూర్జ్ ఖలీఫా కింద బర్త్ డే సెలబ్రేషన్స్! ఇంత కంటే స్పెషల్ ఏమీ ఉండదు. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను” అని విఘ్నేష్ శివన్ తెలిపారు.
పెళ్లి తర్వాత నయనతార నటనకు ఫుల్ స్టాప్ పెడతారా? సినిమాల్లో నటించడం మానేస్తారా? అని చాలా మందికి సందేహం కలిగింది. ఎందుకంటే… ఆమెకు పెళ్లి తర్వాత నటించకూడదని విఘ్నేశ్ తల్లి కండిషన్ పెట్టారని గుసగుసలు వినిపించాయి.
నటనకు ఫుల్ స్టాప్ పెట్టి నిర్మాతగా మాత్రమే కంటిన్యూ అవుతారని కూడా చెన్నై సినీ వర్గాల్లో వినిపించింది. వాటన్నిటికీ చెక్ పెడుతూ… నయనతార 75వ సినిమా ప్రకటన వచ్చింది.
పెళ్లికి ముందు నయనతార కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’లో నయనతార నటిస్తున్నారు.