టాలీవుడ్ టాప్ సింగర్స్ గీతా మాధురి, సత్య యామిని, మనీషా, సమీరా భరద్వాజ్, సాకేత్, అనుదీప్.. వీళ్లంతా కలిసి ఓ సూపర్ హిట్ పాటను ఆలపించారు. విన్ను ముత్యాల ఈ పాటను తెరకెక్కించారు కేశవ కిరణ్ సాహిత్యంతో పాటు సంగీతాన్ని అందించారు. గౌరీ కల్యాణ వైభోగమే అంటూ వీరంతా కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
గత నెల 27న యూట్యూబ్లో విడుదల చేసిన ఈ వీడియోను ఇప్పటికి దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. వివాహ బంధం విశిష్టతను.. వివాహ వేడుకలో భాగమైన పట్టు వస్త్రాల నుంచి తాళిబొట్టు వరకు అన్నింటి విశిష్టతను తెలియజేస్తూ 4 నిమిషాల పాటు ఈ గపాట సాగుతోంది. టాలీవుడ్ సంగీతంలోనే ఈ గీతం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఓ ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ ఈ పాటను నిర్మించడం విశేషం.
గీతా, సాగేత్ అండ్ గ్యాంగ్ ఇప్పటికే చాలా పాటలు కలిసి పాడారు. చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశారు. వీరి మ్యూజిక్ ఆల్పమ్స్కి సపరేటుగా ఓ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వీరి పాటలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ పాట కూడా తెగ ట్రెండ్ అయిపోతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఈ పాటపై తెగ రీల్స్ చేసేస్తున్నారు.