‘సీతారామం’ ఒక దృశ్యకావ్యం.. తెలుగు సినిమాపై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసల వర్షం..

-

సినీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చిన చిత్రం ‘సీతారామం’ అని చెప్పొచ్చు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతున్న ఈ చిత్రానికి చక్కటి స్పందన వస్తోంది. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాపైన తాజాగా బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు.

ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా సినిమా గురించి ట్వీట్ చేశారు. తాను తాజగా ‘సీతారామం’ చూశానని, అందులో దుల్కర్‌ని చూడటం చాలా రిఫ్రెష్‌గా అనిపించిందని, చాలా ఇంప్రెస్ అయ్యానని, అది అతని నిజాయతీ నుంచి వచ్చిందని పేర్కొన్నాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. మృణాళ్ ఠాకూర్ గురించి ఏమని చెప్పాలని, ఆమె నటనను చూడటం ఇదే మొదటిసారి అని, చాలా నిజాయతీగా ఆమె నటించిందని, త్వరలో ఆమె పెద్ద స్టార్ అవుతుందని.. చెప్తూ అభినందనలు తెలిపారు దర్శకుడు వివేక్.

వివేక్ ట్వీట్ చూసి తెలుగు సినీ ప్రియులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌లో పండిట్లపై జరిగిన అరాచకాల ఆధారంగా దర్శకుడు వివేక్ అగ్నోహోత్రి తెరకెక్కించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘సీతారామం’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేశారు.

‘సీతారామం’ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్ అయింది. ఇందులో రష్మిక మందన, సుమంత్ కీలక పాత్రలు పోషించారు. హను రాఘవపూడి వైజయంతీ మూవీస్ బ్యానర్ లో మరో సినిమా కూడా చేస్తారని దర్శకుడు అశ్వనీదత్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news