బిగ్ బాస్: ఈవారం నామినేట్ అయింది వీళ్లే..!!

-

బిగ్ బాస్ సీజన్ 6 లో మూడో వారం నామినేషన్ మొదలయ్యాయి. ఇక హాట్ స్టార్ లైవ్ లో 6 గంటల నుంచి నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి.. ఇక రీసెంట్ గా వచ్చిన ప్రోమోలో చూసినట్లయితే నిర్భయంగా ధైర్యంగా నామినేట్ చేయమని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ రెచ్చిపోయారు. ముఖ్యంగా గీతూ తో ఇనయ, సుదీపా, నేహా ముగ్గురు ఆర్గుమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు ఒకరిని మాత్రమే నామినేట్ చేశారా? లేక ఇద్దరిని నామినేట్ చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ హౌస్ మేట్ ముఖంపై పెయింట్ పూసి మరి రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు.. చాలామంది హౌస్ మేట్స్ నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.. ఇనయ, గీతూ మధ్య సాలిడ్ గొడవ కూడా జరిగింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే 10 మంది వరకు నామినేట్ అయ్యారని తెలుస్తోంది..

ఇక నిజానికి 11 మంది నామినేట్ అయినప్పుడు రాజశేఖర్ తన కెప్టెన్సీ పవర్ ద్వారా ఒకరిని సేవ్ చేసినట్టుగా తెలుస్తోంది.అయితే ఎవరు సేఫ్ అయ్యారు అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతానికి 10 మంది వరకు లిస్టులో ఉన్నారు. ఇక ఆ లిస్టులో బాలాదిత్య, చంటి, రేవంత్ , గీతూ, ఇనయ, వాసంతి , నేహా, సుదీప , ఆరోహి , శ్రీహన్ ఉన్నట్లుగా సమాచారం. ఇక గత సీజన్లో పాటిస్పేట్ లు ఎక్కువమంది ఫస్ట్ వీక్ లోనే కనిపించేవారు. అందుకే ఇద్దర్ని నామినేట్ చేసేసారు. కానీ ఇప్పుడు సీజన్లో ఇద్దరు తగ్గిపోయారు కాబట్టి నామినేషన్ కూడా రసవత్తరంగా జరిగాయి. ఇకపోతే ఆదిరెడ్డి కూడా ప్రెస్టేట్ అయ్యి కలర్ బౌల్ ని ఎత్తి పారేస్తా అంటూ రెచ్చిపోయాడు. అలాగే గీతూ ఇంకా సుదీప ఇద్దరి మధ్యలో సుదీప బాగా ఎమోషనల్ అయింది.

ప్రోమోలో చూస్తే గీతూకి ఎక్కువగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మరి ప్రతి ఒక్కరు కూడా సిల్లీ రీజన్స్ చెప్పారు అనేది తెలుస్తోంది. కానీ డేర్ గా స్టెప్ ముందుకు వేస్తున్న గీతూ రాయల్ ను నామినేట్ చేస్తూ ఆమెను ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కంటెస్టెంట్స్.

Read more RELATED
Recommended to you

Latest news