హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. సుప్రీం కోర్టుతో కర్ణాటక సర్కార్​

-

హిజాబ్​ వివాదంపై సుప్రీం కోర్టుకు వెళ్లింది కర్ణాటక ప్రభుత్వం. హిజావ్ వివాదం వల్ల తమ రాష్ట్రంలో జరిగిన కుట్రల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం ఉందని కోర్టుకు తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని.. భారీ కుట్రలో భాగంగా విద్యార్థుల మనస్సులో విషం నింపారని ఆరోపించింది. విద్యార్థులు, ప్రజల్లో మతపరమైన భావాలను రెచ్చగొట్టి ఆ సంస్థ సోషల్ మీడియాలో విష ప్రచారాలు నిర్వహించిందని కర్ణాటక సర్కార్ తరఫున సొలిసిటర్ జనర్ తుషార్ మెహతా సుప్రీంకు వాదనలు వినిపించారు.

‘పీఎఫ్ఐ సంస్థ సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్ ప్రారంభించింది. విద్యార్థులందరినీ హిజాబ్ ధరించాలని కోరింది. ఇదేదీ(నిరసనలు) అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు ప్రారంభించింది కాదు. ఇవి భారీ కుట్రలో భాగమే. విద్యార్థులు వారికి వచ్చిన సూచనల ఆధారంగానే నడుచుకున్నారు. గతేడాది వరకు కర్ణాటకలోని స్కూళ్లలో ఏ బాలిక కూడా హిజాబ్ ధరించలేదు. హిజాబ్ ధరించకూడదని చెప్పి ఒక మతానికి వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం సరికాదు’ అని తుషార్ మెహతా వివరించారు. ఈ అంశంపై ఇవాళ వాదనలు కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news