కొద్ది రోజులుగా సోమారపుపై, ఆయన అనుచరులపై దౌర్జన్యాలు పెరిగాయట. టీఆర్ఎస్ పార్టీలో అరాచకం పెరిగిపోయిందంటూ… ఆయన ఆరోపించారు. క్రమశిక్షణ లేకుండా పోయిందని.. అటువంటి పార్టీలో తాను ఉండలేనని తెలిపారు.
ఇన్ని రోజులు టీడీపీకి, కాంగ్రెస్ పార్టీకి షాక్ లు తగిలాయి. కానీ.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓ షాక్ తగిలింది. టీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత పార్టీని వీడారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు.
కొద్ది రోజులుగా ఆయనపై, ఆయన అనుచరులపై దౌర్జన్యాలు పెరిగాయట. టీఆర్ఎస్ పార్టీలో అరాచకం పెరిగిపోయిందంటూ… ఆయన ఆరోపించారు. క్రమశిక్షణ లేకుండా పోయిందని.. అటువంటి పార్టీలో తాను ఉండలేనని తెలిపారు. పార్టీలో గౌరవం లేనప్పుడు పనిచేయడం కష్టమని తెలిపారు. అందుకే.. టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు.
కేసీఆర్ అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు..
కేసీఆర్ అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కొందరి తీరు వల్లే టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నా. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా నన్ను వేధించారు. రామగుండంలో నా ఓటమికి బాల్క సుమన్, మరికొందరు నేతలే కారణం. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా.. అంటూ సోమారపు సత్యనారాయణ అన్నారు.
సోమారపు రాజకీయ ప్రస్థానం ఇదే
సోమారపు సత్యనారాయణ.. 2009లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ కు మద్దతు పలికారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగాక.. టీఆర్ఎస్ లో చేరారు. 2014లో రామగుండం నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. గెలిచారు. కాకపోతే.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓడిపోయారు. తర్వాత చందర్ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో సోమారపు అసంతృప్తికి లోనయ్యారు. చందర్ ను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై జీర్ణించుకోలేకపోయిన సోమారపు… పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తాజాగా నిజం చేశారు. కాకపోతే.. ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.