Manmadhudu2 Teaser : అవంతిక, పద్ధతిగల అమ్మాయి.. బొంగేంకాదు !

-

ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా… వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లతో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అవంతిక.. ఆహా పేరే ఎంత వినసొంపుగా ఉంది. అంతే పద్ధతి గల అమ్మాయి. ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది సార్.. బొంగేం కాదు. రెండు సంవత్సరాలుగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్స్ తట్టుకోలేవు. ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నించాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా. అంటే.. సచ్ ఏ డేంజరస్ బేబ్.. ఐ లవ్యూ మోర్.. గివ్ మీ మోర్.. ఏంటి ఈ డైలాగ్స్ అంటారా?

ఇవన్నీ నాగార్జున మన్మథుడు2 సినిమాలోని డైలాగ్స్. అవును.. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా.. సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసింద మూవీ యూనిట్. సినిమాలో రకుల్ పేరు అవంతిక. ఇక.. అవంతిక మాత్రం ఈ వీడియోలో చాలా అందంగా ఉంది.

ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా… వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లతో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక.. ఈ సినిమా ఆగస్టు 9న రీలీజ్ కానుండగా.. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను మూవీ యూనిట్ ప్రారంభించింది. ఈ సినిమాలో రకుల్ రెండు షేడ్స్ లో ఉన్న పాత్రలో నటిస్తోందట. సమంత, కీర్తి సురేశ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ముఖ్య పాత్రల్లో వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావు రమేశ్, ఝాన్సీ, దేవదర్శిని నటిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.

Read more RELATED
Recommended to you

Latest news