ఆల్వేస్ రామ్ చ‌ర‌ణ్ .. ఇన్ స్టాలో వారియ‌ర్ ?

-

సోష‌ల్ మీడియా యుగం ఇది. ప్ర‌పంచానికి క‌నెక్ట‌య్యి ఉండాలంటే ఇన్ స్టా- ట్విట్ట‌ర్- ఫేస్ బుక్ ని మించిన బెస్ట్ ఆప్ష‌న్ లేదు. వీటితోనే నేటి యూత్ 24/7 డే&నైట్‌ కాపురం చేస్తోంది. అక్క‌డ ప్ర‌చారానికి ప్ర‌చారం.. ఫాలోయింగ్ తో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం వ‌స్తుండ‌డంతో సెల‌బ్రిటీలు ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌కుండా సోష‌ల్ మీడియాల‌తో ట‌చ్ లో ఉంటున్నారు. టాలీవుడ్ స్టార్ల‌లో ప‌వ‌న్ – మ‌హేష్‌- ప్ర‌భాస్- అల్లు అర్జున్ ఇన్ స్టాలో ఉన్నారు.. ప‌లువురు ట్విట్ట‌ర్ .. ఫేస్ బుక్ లోనూ యాక్టివ్ గానే ఉన్నారు.

Ram Charan all set for Instagram Debut

ఇటీవ‌లే ప్ర‌భాస్ ఇన్ స్టాలో ప్ర‌వేశించి సాహో కి సంబంధించిన పోస్ట్ తో ఫ్యాన్స్ లోకి వైర‌ల్ గా దూసుకెళ్లారు. ఇప్పుడు అదే బాట‌లో రామ్ చ‌ర‌ణ్ ఇన్ స్టాలో ప్ర‌వేశించారు. `ఆల్వేస్ రామ్ చ‌ర‌ణ్‌` అనేది ఇన్ స్టా టైటిల్. వాస్త‌వానికి చ‌ర‌ణ్ ఫేస్ బుక్ లో ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ ఇత‌ర‌త్రా మాధ్య‌మాల్లోకి రాలేదు. ర‌క‌ర‌కాల వివాదాల‌కు సంబంధించి లేదా ఎంతో ముఖ్య‌మైన విష‌యాల్ని మాత్ర‌మే అక్క‌డ ప్ర‌స్థావిస్తుంటారు. తాజాగా ఇన్ స్టాలో ప్ర‌వేశించి ఆర్.ఆర్.ఆర్ సీతారామ‌రాజు లుక్ ని ఇందులో తొలిగా పోస్ట్ చేశారు. ఒకే ఒక్క పోస్ట్ కే ఇప్పటికే 59 వేల మంది అనుస‌రిస్తున్నారు. ఇక ఇన్ స్టాలో చాలా కాలంగా ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ ఎంతో యాక్టివ్ గా ఉంటూ అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని పెంచుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆల్వే స్ రామ్ చ‌ర‌ణ్ పేరుతో ఇత‌ర‌త్రా మెగా ఫ్యాన్స్ పేజీలు ఇన్ స్టాలో ఉన్నాయి. దీంతో చిన్న‌పాటి క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొన్నా .. చ‌ర‌ణ్ టైమ్ లైన్ ని గుర్తించ‌డం ఈజీనే. ఇప్ప‌టికి ఒకే ఒక్క పోస్ట్ తో ఉందీ ఇన్ స్టా. మునుముందు ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ని.. అలానే వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని చ‌రణ్ ఇక్క‌డ ఫోటోలు- వీడియోల రూపంలో అభిమానుల‌కు షేర్ చేయ‌నున్నారు. సోష‌ల్ మీడియా వార్ లో మ‌రో డ్రాకులా ప్ర‌వేశించిన‌ట్టే..

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan) on

 

Read more RELATED
Recommended to you

Latest news